– అవిశ్వాసంలో నైతికంగా మేమే గెలిచాం
– జమ్మికుంట మాజీ సర్పంచ్ పొన్నగంటి
నవతెలంగాణ జమ్మికుంట: మంత్రుల సహకారంతో జమ్మికుంట పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని మాజీ సర్పంచ్, 23 వ వార్డు కౌన్సిలర్ పొన్నగంటి మల్లయ్య అన్నారు . గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు .మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు పై గత నెల 29న జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఉన్న 30 మంది కౌన్సిలర్ల లో నుండి 20 మంది కౌన్సిలర్లు అందరం కలిసి చైర్మన్ పై అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించుకొని అవిశ్వాస పత్రంపై సంతకాలు చేసి జిల్లా రెవెన్యూ అధికారికి అందజేయడం జరిగిందని ఆయన అన్నారు. అవిశ్వాసం పెట్టిన 20 మంది కలిసి హైదరాబాదులో క్యాంపులో ఉన్నామని, క్యాంపు దగ్గరికి చైర్మన్ తో పాటు ఆయన వర్గీయులు వచ్చి గొడవ చేయడం జరిగిందని, మా క్యాంపులో ఉన్న నలుగురు కౌన్సిలర్లను భయపెట్టి తీసుకపోవడం జరిగిందని ఆయన తెలిపారు.
ఈనెల 25న అవిశ్వాస తీర్మానం కొరకు ఓటింగు కోసము సమావేశం కావాలని జిల్లా కలెక్టర్ నోటీసులు అందజేయడం జరిగిందన్నారు. 16 మంది కౌన్సిలర్లు అందరం కలిసి సమావేశానికి హాజరు కావడం కోసం వచ్చామని, కానీ చైర్మన్ దగ్గర ఉన్నా 14 మంది కౌన్సిలర్ లను దూర ప్రాంతానికి తీసుకెళ్లారని ఎందుకంటే వారు వస్తే అవిశ్వాసము నెగ్గుతుందని భయం చైర్మన్ కు ఉంది కాబట్టే రాలేదని ఆయన ఆరోపించారు. వారు సమావేశం రాలేదు కాబట్టి మేము రాలేదన్నారు. వచ్చిన కోరము లేదు కాబట్టి రాలేదని ఇట్టి విషయాన్ని జమ్మికుంట పట్టణ ప్రజలు గమనించాలన్నారు. నైతికంగా మేమే గెలిచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 16 మంది కౌన్సిలర్లు పాల్గొన్నట్లు తెలిపారు.