హైదరాబాద్ : హైబిజ్ టివి రియాల్టీ అవార్డ్స్ -2024 ప్రధానోత్సవం వేడుకగా జరిగింది. హైటెక్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బిసి కమిషన్ ఛైర్మన్ వకుళభరణం కృష్ణ మోహన్ రావు హాజరై విజేతలకు అవార్డులను ప్రధానం చేసారు. రియాల్టీ రంగం ఉన్నత స్థాయిలో అభివృద్థి చెందటానికి సహకారం అందిస్తున్న సంస్థలు, వ్యక్తులకు, 25 వివిధ విభాగాలలో అవార్డులను అందజేశారు.రియాల్టీ అవార్డ్స్-2024 మొదటి ఎడిషన్ అవార్డుల కార్యక్రమంలో క్రెడారు జాతీయ ప్రధాన కార్యదర్శి జి రామ్ రెడ్డి, మహా సిమెంట్ సీనియర్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ విజరు వర్థన్ రావు, ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ రీజినల్ మేనేజర్ జై ప్రకాష్ బాబు, సుధాకర్ గ్రూప్ ఎండి జైదేవ్ మీలా, హైబిజ్ టివి ఎండి ఎం రాజ్ గోపాల్, సిఇఒ జె సంధ్య రాణి తదితరులు పాల్గొని వివిధ విభాగాలలో విజేతలకు అవార్డులను అందజేశారు.