చెరువు కాల్వను అక్రమించి, అక్రమ వెంచర్ నిర్మాణం 

– అధికారులకు ఫిర్యాదు చేసిన తోటపల్లి గ్రామస్తులు

– చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ 
నవతెలంగాణ – బెజ్జంకి 
చెరువు నుండి పంటలకు నీరందించే సాగు కాల్వను అక్రమించి అక్రమ వెంచర్ నిర్మాణం చేపట్టి ప్లాట్లు విక్రయిస్తున్నారని జిల్లా పరిపాలనాధికారి,నీటిపారుదల,తహసిల్దార్,ఎంపీడీఓ అధికారులకు పిర్యాదు చేసినట్టు పలువురు తోటపల్లి గ్రామస్తులు సోమవారం తెలిపారు.ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతుల్లేకుండా యథేచ్ఛగా అక్రమ వెంచర్ యందు వ్యాపారస్తులు ప్లాట్లు విక్రయిస్తూ కొనుగోలుదారులను మోసం చేస్తున్నారని ఇప్పటికైనా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అక్రమణకు గురైన చెరువు కాల్వ భూమిన స్వాధీనం చేసుకుని పునరుద్ధరించారని వార్డ్ సభ్యుడు శంకర్ అధికారులను డిమాండ్ చేశాడు.
Spread the love