టీటీయూ క్యాలెండర్ అవిష్కరించిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – జుక్కల్

మండలంలో టీటీయూ కార్యవర్గం సబ్యులు జిల్లా కార్యవర్గ సబ్యులతో కలిసి సోమవారం నాడు టీటీయూ క్యాలెండర్ ను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావ్ చేతుల మీదుగా అవిష్కరించారు. ఈ సంధర్భంగా ఎమ్మెలే మాట్లాడుతూ.. ఉపాద్యాయులు ప్రభుత్వ పాఠశాలలో  గ్రామీణ పేదలకు నాణ్యమైన విద్యను అందించి , విద్యార్థుల భవిషత్ ను తీర్చి దిద్దాలని అకాంక్షించారు. కార్యక్రమంలో టిటీయూ జిల్లా అద్యక్షుడు ముజిబోద్దిన్ , జుక్కల్ మండల అద్యక్షుడు కాంబ్లే సాయులు , ప్రదాన కార్యదర్శి షేక్ ఉమీరోద్దిన్ , ప్రతినిధులు సంజీవ్, రవి, శంకర్ , రమేష్, వెంట్రాములు మరియు ఉపాద్యాయులు తదితరులు పాల్గోన్నారు.
Spread the love