
– ఫిబ్రవరి 11న తిరుపతిలో ప్రధానం..
నవతెలంగాణ – బెజ్జంకి
డాక్టర్ ఆర్ఎస్ ప్రవీన్ కుమార్ స్థాపించిన స్వేరోస్ ఇంటర్నేషనల్ విశిష్ట సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. బహుజన సాహిత్య అకాడమి స్వేరోస్ సేవలను గుర్తించి జాతీయ పురస్కారం ప్రకటించింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జాతీయ పురస్కారానికి మండల పరిధిలోని ముత్తన్నపేట గ్రామానికి చెందిన స్వేరోస్ నెట్ వర్క్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొర్ర సురేశ్ కుమార్ ఎంపికైనట్టు మంగళవారం బహుజన సాహిత్య అకాడమి జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 11న అంద్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో నిర్వహించనున్న దక్షిణ భారత బహుజన రచయితల సమావేశంలో బొర్ర సురేశ్ కుమార్ కు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జాతీయ పురస్కారం ప్రధానం చేయనున్నట్టు నల్లా రాధాకృష్ణ తెలిపారు. జాతీయ పురస్కారానికి ఎంపికైన సురేశ్ కుమార్ కు మండలంలోని స్వేరోస్ నెట్ వర్క్ సభ్యులు అభినందనలు తెలిపారు.