
– ధర్నాను నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు
నవతెలంగాణ – మిరు దొడ్డి
రైతు సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూడడం సరికాదని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి అన్నారు. రైతుల పంటలకు కావలసిన సాగునీటిని కూడవేల్లి వాగు ద్వారా వెంటనే విడుదల చేయాలని రాస్తారోకో నిర్వహించారు. అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో బి.ఆర్.ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి కావాల్సిన సాగునీటిని విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. దుబ్బాక నియోజకవర్గం రైతులకు సాగునీటికి ఇబ్బందులు కలవకుండా మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేసిన ఘనత కేసిఆర్ కె దక్కిందన్నారు. ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులకు సాగునీరు లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. రైతు పక్షపాతిగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనదాతలను మోసం చేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం మొట్టమొదటిలోనే కనబడుతుందన్నారు రైతులకు వ్యతిరేకంగా నీటిని విడుదల చేయకపోవడం సరికాదని మండిపడ్డారు వెంటనే రైతులకు సాగునీరు అందించడానికి కూడా వెళ్లి వాగు ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు సరిపడా సాగునీరు ప్రభుత్వం అందించి రైతులకు అండగా నిలవడం జరిగిందని గుర్తు చేశారు. అన్నదాతలను ఇబ్బందులకు గురి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. వెంటనే మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా కూడా వెళ్లి వాగులోకి సాగునీటిని విడుదల చేయాలని లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కైలాస్ ,సురేష్ గౌడ్ , శ్రీనివాస్ గౌడ్, కిషన్, ప్రభాకర్, శ్రీనివాస్, కృష్ణ బీఆర్ఎస్ నాయకులు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.