బదీలీపై వెళ్లిన ఉపాధ్యాయునికి సన్మానించిన ఉపాధ్యాయ బృందం

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని వండ్రికల్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో గత13 సంవత్సరాల నుండి గణిత ఉపాధ్యాయునిగా పనిచేసి, పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు అందించిన ఉప్పు వెంకట్  గత సెప్టెంబర్లో జరిగిన బదిలీల్లో కామారెడ్డి ఉన్నత పాఠశాలకు వెళ్ళడం జరిగింది. ఈ రోజు పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామ పంచాయితీ, smc సభ్యులు అందరూ కలిసి ఘనంగా సన్మానించారు. వెంకట్  వారి జ్ఞాపకంగా పాఠశాలలో చదువుతున్న అందరు విద్యార్థులకు మధ్యాహ్న భోజన ప్లేట్లను వితరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో  మండల విద్య అధికారి-సేవ్లా , ప్రధానోపాధ్యాయులు దాస్ , ఉపాధ్యాయులు పరుశరామ్, షాహిన్ సుల్తాన, మారుతి రావు, రామానుజన్, విజయ్, ఉప సర్పంచ్, మానప, రవి,  ఎస్ ఏం సి చైర్మన్ -శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love