తిరుమలగిరి ఎస్సై ను సన్మానిస్తున్న కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ –  తిరుమలగిరి
తిరుమలగిరి ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ గౌడ్ ను  తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్సోజు  నరేష్  ఆధ్వర్యంలో శుక్ర వారం  సన్మానం చేశారు.ఈ సందర్భంగా ఎస్సై సత్యనారాయణ మాట్లాడుతూ  మండలంలో శాంతి భద్రతలు కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జెమ్మిలాల్, సీనియర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు రాపాక సోమేశ్, 4 వార్డ్ కౌన్సిలర్ బత్తుల శ్రీను,  మాజీ వైస్ ఎంపీపీ సుంకర్ జనార్దన్,రాము గౌడ్, మూల రవీందర్ రెడ్డి, ఒకటో వార్డు కౌన్సిలర్ భాస్కర్, మాజీ ఎంపిటిసి దుప్పెల్లి అబ్బాస్, తొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాంసపెల్లి మోహన్, సలీం, కృష్ణ నాయక్, వీరు నాయక్,  నాలుగో వార్డు నాయకులు తోట ఉపేందర్, షేక్ రషీద్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love