విద్యార్థులు పుస్తకాలకు దగ్గరగా, చరవాణి లకు దూరంగా ఉండాలి

నవతెలంగాణ –  గాంధారి 
గాంధారి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మండల విద్యాధికారి సేవ్ల సందర్శించి 10వ తరగతి ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం విద్యార్థులతో పరీక్షల సంసిద్దత గురించి తెల్సుకొని పరీక్షల పట్ల ఒత్తిడి కి లోనుకాకుండా స్వేచ్ఛగా మంచి ప్రణాళిక తో చదవి అందరు మంచి గ్రేడ్ సాధించి 100% ఫలితాలతో మీ తల్లితండ్రులకు, ఉపాధ్యాయులకు అదేవిదంగా మన మండలంకి మంచి పేరు తీసుకూ రావాలని తెలియజేస్తూ పుస్తకాలకు దగ్గరగా చరవాణి లకు దూరంగా ఉంటూ మరియు ఆరోగ్యంగా ఉంటూ ఉన్న తక్కువ సమయాన్ని పరీక్షలకు చదవడానికి ఉపయోగించాలని విద్యార్థులకు పలు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు రాజపండిత్ , ఉపాధ్యాయుల బృందం  మరియు సీఆర్ పీ రాజు తదితరులు ఉన్నారు.
Spread the love