– తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి.కృష్ణమూర్తి
నవతెలంగాణ- అంబర్‌పేట
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పెన్షన్‌దారులందరికీ పింఛన్ వర్తింపజేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ ఆసోసియేషన్(టీఏపీఆర్‌పీఏ) రాష్ట్ర అధ్యక్షులు పి.కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బర్కత్‌పురాలోని ఈపీఎఫ్ కార్యాలయం ముందు టీఏపీఆర్‌పీఏ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. అనంతరం అసోసేయేషన్ ప్రతినిధులు బర్కత్‌పురా ఈపీఎఫ్ కమిషనర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఎగ్జెంప్టైడ్, అన్ ఎగ్జెంప్టైడ్ అనే భేదం లేకుండా పెన్షన్‌దారులందరికీ పెన్షన్లు చెల్లించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తున్నదన్నారు. కోర్టులపై నమ్మకం కూడా లేకుండా చేస్తున్నారని.. సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.