ఎల్‌ఐసీ ఎంఎఫ్‌ నుంచి కొత్త ఫండ్‌

ఎల్‌ఐసీ ఎంఎఫ్‌ నుంచి కొత్త ఫండ్‌ముంబయి : ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ కొత్త ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ)ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ‘ఎల్‌ఐసి ఎంఎఫ్‌ నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 ఈటీఎఫ్‌’ని విడుదల చేసినట్లు ప్రకటించింది. ఇది ఫిబ్రవరి 8న తెరబడిందని.. 12న మూసివేయనున్నట్టు తెలిపింది. ఈ ఫండ్‌ నిరంతర విక్రయం, పునర్‌ కొనుగోలు కోసం 19 ఫిబ్రవరి 2024న తిరిగి తెరవబడు తుందని ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈఓ, ఎండీ రవి కుమర్‌ ఝా తెలిపారు. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.500గా నిర్ణయించామన్నారు.

Spread the love