
పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన ఆ గ్రామ సర్పంచ్ బోద్నం విఠల్ కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ అధికార పార్టీ బిఆర్ యస్ ఆగడాలను తట్టుకునిసర్పంచ్ సమయ స్పూర్తితో ప్రజలందరికీ సేవలు అందించారని కొనియాడారు. పదవీ విరమణ పొందినా సర్పంచ్ విఠల్ ప్రజలకు సేవ చేస్తూనే ఉండాలని, ఆయన అమూల్యమైన సలహాలు,సూచనలు అందించి గ్రామాభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఐదేళ్లు తన పాలనకు సహకారం అందించిన నాయకులకు,అధికారులకు,ప్రజలకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మొహిద్దిన్ పటేల్,సింగిల్ విండో డైరెక్టర్లు పెంటయ్య, గంగాగౌడ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు మొగులా గౌడ్, రసూల్ పటేల్, బుగుడాల హన్మాండ్లు, సోంపేట సాయులు, అబ్బన్ బోయిన విజయ్, చాంద్ పాషా,ఇస్మాయిల్ పటేల్, నీరుడి అశోక్, బందిగి పర్వయ్య, సర్వగల్ల రాంచందర్, ఆకుల రాంచందర్, చౌటకురి శంకర్ తదితరులు పాల్గొన్నారు.