ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

నవతెలంగాణ-  మోపాల్
మోపాల్ మండల కేంద్రంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి 60వ పుట్టినరోజు వేడుకను కిసాన్ కెత్ జిల్లా అధ్యక్షుడు ముప్పగంగారెడ్డి,  మండల అధ్యక్షుడు సాయి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక కస్తూరిబా బాలికల హాస్టల్లో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే అక్కడ చదువుతున్న విద్యార్థులతో కేక్  కట్ చేయించారు. ఈ సందర్భంగా ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇంకా ఎన్నో ఉన్నత పదవులు పొందాలని ఆయన కోరారు .ఈ కార్యక్రమంలో డీసీసీ సెక్రెటరీ వేల్మా భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి, శేఖర్ గౌడ్, తదితర నాయకులు పాల్గొన్నారు.
Spread the love