డిప్యూటీ తహసీల్దార్ కు ఘనంగా సన్మానం

నవతెలంగాణ – మోపాల్

మోపాల్ మండల కేంద్రంలోని డిప్యూటీ తహసీల్దార్ మునీరుద్దీన్ నిర్మల్ జిల్లాకు బదిలీ అయిన సందర్భంగా సోమవారం రోజు రిలీవ్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్వో, మండల సిబ్బంది కలిసి ఆయన ఘనంగా సన్మానించి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. మునిరుద్దీన్ ఇంకా మంచి స్థాయికి రావాలని ఇంకా ప్రమోషన్లతో ముందు ముందు ఉన్నత స్థాయిలో నిలబడాలని ఆయన కోరారు. అలాగే అక్కడికి వచ్చిన కొందరు ప్రజలు మాట్లాడుతూ.. మండల కేంద్రంలో ఆయన మాకు ఒక పెద్ద దిక్కుగా ఉండేవాడని స్థానికంగా ఏ సమస్య వచ్చినా ఆయనని సంప్రదిస్తే దానికి తగు సూచనలు చేసేవారని, అటువంటి వ్యక్తి మన మండలంలో పనిచేయడం మనందరికీ గర్వకారణమని, ఒక రకంగా చెప్పాలంటే స్థానిక మండల ఆఫీసులో ఆయనే అన్ని వివరిస్తూ అందరికి సూచనలు చేస్తూ తన కర్తవ్యాన్ని బాధ్యతను సమగ్రంగా నిర్వహించాడు, ఉదయం నుండి సాయంత్రం వరకు ఉంటూ ఖచ్చితమైన సమయపాలన పాటించేవాడు, ఉన్నతాధికారులు చెప్పే ప్రతి విషయాన్ని ప్రజల వివరిస్తు రెవెన్యూ వ్యవస్థ పనితీరును ప్రజలకు తెలిపేవాడు ముఖ్యంగా విద్యార్థులకు కావాల్సిన ఇన్కమ్ సర్టిఫికెట్ కాస్ట్ సర్టిఫికెట్ విషయంలో అతి తొందరగా వచ్చే విధంగా కృషి చేశాడు. అక్కడికి వచ్చిన కొందరు ప్రజలు భావోద్వేగానికి గురై అయ్యారు. ఎంతోమంది ఆఫీసర్లు వస్తుంటారు వెళ్తుంటారు. కానీ కొందరు మాత్రం ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. అలా నిలిచిపోయిన వారిలో మోపాల్ డిప్యూటీ తహసీల్దార్ మున్నీరుద్దీన్  ఒకరు.
Spread the love