
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఈటూరు గ్రామం నుండి గొల్ల కురుమల యాదవులకు డీడీలు కట్టిన ప్రతి ఒక్కరికి రెండో విడత గొర్రెల పంపిణీ కొనసాగించాలి అని తెలంగాణ గొర్రెల మేకల పెంపకదారులసంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన రవి
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిఎంపిఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీ) సిహెచ్ ప్రియాంక కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని ఆశతో భార్యల మెడలోని పుస్తెలతాలు, బంగారం, బ్యాంకులలో తాకట్టుపెట్టి ఇచ్చారు. గ్రామంలో 130 మంది ఒక్కొక్కరు రూ 43.750 రూపాయలు చొప్పున సూర్యాపేట జిల్లాలో16,900 మంది లబ్ధిదారులు గొర్రెల కోసం డీడీలు కట్టి నెలలు తరబడి ఎదురుచూస్తున్నా, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. గొర్రెలు పంపిణీ చేయలేదని గత ప్రభుత్వానికి గొల్ల కురుమలు బుద్ధి చెప్పారు అని, అదే పద్ధతిలో ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తే రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్ లో గొల్ల కురుమలు అందరు బుద్ధి చెప్పుతామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ అకౌంట్ లో డబ్బులు జమ చేయడం జరిగింది అని వాటిని యాదవులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాదవులకు గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పడంతో అప్పులు తెచ్చి మరి డీడీలు కట్టినము అని వాటికి వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గొర్రెల పంపిణీ చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల గొర్రెలు వస్తాయా రావా అని యాదవులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. గొర్రెల పంపిణీ డీడీలు కట్టిన ప్రతి ఒక్కరికి గొర్రెల పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపాలిటీ పరిధిలో యాదవులందరికీ ఈ పథకం వర్తింపజేయాలని అన్నారు.చేయలేని ఎడల జిల్లాలలో యాదవులు అందరిని సమకూర్చి ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గొర్రెల పెంపకదారుల సహకార సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శి కోడి ఎల్లయ్య, కడారి ఐలయ్య, కడారి అంజయ్య, కన్నెబోయిన చంద్రమౌళి, చిల్లరి సోమన్న, శీల మల్లమ్మ, శీలం అనిత, నడిపెల్లి శీను, కన్నబోయిన ఐలయ్య, పరశురాములు, మహేష్, లింగయ్య, పుల్లయ్య, సోమన్న, వెంకన్న, రవి ,శీను, తదితరులు పాల్గొన్నారు.