
– భారీగా తరలి రానున్న భక్తులు
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం తుంగతుర్తి లో ఈ నెల 16 నుంచి శ్రీ శ్రీ శ్రీ స్వయంభూ పార్వతి సమేత సోమేశ్వర స్వామి ఉత్సవాలు మూడు రోజుల పాటు వేడుకలా జరుగనున్నట్లు ఆలయ చంద్ర శేఖర శర్మ, ప్రవీణ్ కుమార్ శర్మ తెలిపారు. మంగళవారం విలేకరుల తో మాట్లాడుతూ కాకతీయుల కాలంలో బాన్సువాడ, కోటగిరి, వర్ని ప్రాంతాలను సోమనాథుడు అనే రాజు పరిపాలిoచేవాడు. ఆ రాజుకు పుత్ర సంతానం లేకపోవడంతో అక్కడ ఆలయ స్థలంలో తపస్సు చేస్తుండగా శివుడు ప్రత్యక్షమై సంతాన భాగ్యం కల్పించాడట. దీంతో ఆ రాజు తనకు పుట్టిన కుమారులకు సోమేశ్వరులుగా నామకరణం చేశాడని చరిత్ర ఉంది. మూడో సోమేశ్వరుని ఆలయ పాచికలు అప్పట్లో కనిపించాయని పురాణాలు చెపుతున్నాయన్నారు.16 వ తేదిన అభిషేకాలు, కుంకుమార్చన, వస్త్రాలంకరణ, గ్రామబాలుహరణ, రాత్రి 10 గంటలకు కల్యాణ మహోత్సవం,17 వ తేదిన మహా అన్నదానం,4 గంటలకు అగ్నిగుండాలు,16 నుంచి 18 వరకు జాతీయ స్తాయి మహిళలు కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఆలయంలోప్రతి సంవత్సరం ఫిబ్రవరి లో వే డుకలు చాలా ఘనంగా జరుగుతాయని ఈ వేడుకలకు జిల్లా నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలతో పాటు తెలంగాణ, మొదలగు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.