
శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం,సామల మందిర్, బాలాపూర్, విగ్రహ ప్రతిష్ట మహోత్సవములో సోమవారం హైదరాబాద్ లోని, యస్.పి.ఆర్ గార్డెన్స్,ఆర్.సి.ఐ రోడ్,బాలాపూర్,సామల మందిర్,సామల వారి మరియు బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ఆహ్వానం మేరకు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డిపాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి గణపతి నవగ్రహ శిఖర ధ్వజ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా మూడు రోజుల పాటు జరిగాయి.తదనంతరం తీర్ధప్రసాదాలు భక్తులు తీసుకున్నారు.వీరితో పాటు ఈ కార్యక్రమంలో బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి గారు, సామల అజయ్ రెడ్డి గారు, గడ్డంపల్లి వినయ్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.