
నవతెలంగాణ – రాయికల్
విధుల్లో చేరని కమిషనర్..పనుల్లో జాప్యం శీర్షికన ఈ నెల 21న నవతెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన వార్త కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. గతంలో మెట్పల్లి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహించిన ఎ.జగదీశ్వర్ గౌడ్ రాయికల్ లో విధులు నిర్వహించేందుకు సుముకంగా లేకపోవడం వల్ల ఇన్ని రోజులుగా విధుల్లో చేరలేదని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్న తరుణంలో వచ్చే సాధారణ ఎన్నికలు ముగిసే వరకైనా విధుల్లో చేరాలని, జిల్లా కేంద్రంలోని ఓ ఉన్నతాధికారి నచ్చజెప్పడంతో ఆయన చొరవతో బుధవారం విధుల్లో చేరినట్లు విశ్వసనీయ సమాచారం.