
నేటి బాలలే రేపటి బావి భారత పౌరులుగా ఎదగాలని దళిత సామాజిక కార్యకర్త పెద్ద లింగన్న గారి కిరణ్ అన్నారు. శుక్రవారం నిర్దోడి మండలం లింగుపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరానికి ఎదగాలన్నారు. విద్యార్థుల కు మంచి విద్యను అభ్యసించడానికి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన అవసరం కొరకు ప్రత్యేకంగా శ్రద్ధచూపి విద్యార్థుల కు నాణ్యమైన విద్యాబోధన కృషి చేయాలన్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున అతనికి ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు .ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరారు.