
విద్యార్థి దశ నుండి వృత్తి నైపుణ్యాల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని ప్రధానోపాధ్యాయులు తారాబాయి రాజిరెడ్డి గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం నూతనంగా బాలికలు అడ్మిషన్ తీసుకున్న నేపథ్యంలో వారిలో ఒకేషనల్ స్కిల్స్ పెంపొందించేందుకు గాను ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు ప్రస్తుత ప్రధానోపాధ్యాయురాలు తారాబాయి రాజిరెడ్డి వారి తల్లిదండ్రులు దివంగత బొద్దిరెడ్డి వెంకటమ్మల జ్ఞాపకార్థం,మరో పూర్వ విద్యార్థి ప్రస్తుత విశ్రాంత అధ్యాపకుడు ఏలుకుర్తి వాస్తవ్యులు,కేదారి వారి తల్లిదండ్రులు మల్లయ్య ,దుర్గమ్మల జ్ఞాపకార్ధంగా రెండు కుట్టు మిషన్లు వితరణ చేశారు.ఈ వితరణకు స్థానిక ఉపాధ్యాయులు మరియు పాఠశాల పూర్వ విద్యార్థులైన రాజమ్మ, ధర్మ ప్రకాష్,కృష్ణమూర్తి కృషి చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థులు, గ్రామ విద్యాభిమానులు పాఠశాల అభివృద్ధికి సహకరించాలని ప్రస్తుత ఉపాధ్యాయ బృందం కోరుతున్నారు.కార్యక్రమంలో స్వర్ణలత, కవిత ,సురేష్ ,పద్మజ, కిరణ్ మై, సునీత ,పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.