నవతెలంగాణ – ధర్మసాగర్
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి అర్హులు తొందరగా మీ దగ్గర మీసేవ సెంటర్ లో దరఖాస్తు చేసుకోవాలని గ్రామపంచాయతీ కార్యాలయం తరపున విజ్ఞప్తి చేస్తున్నామని గురువారం సామాజిక మద్యమాల్లో గ్రామ కార్యదర్శి మహేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు స్వయం ఉపాధిగా వృత్తిలో చేతి పనిముట్లు ను ఉపయోగించే వడ్రంగి, కమ్మరి, కంసాలి, స్వర్ణకార, కుమ్మరి, మేదరి, ఉప్పరి, వెదురు బుట్టలు అల్లేవారు, బొమ్మలు చేసేవారు, రజకులు, నాయీ బ్రాహ్మణ, దర్జీలు, చేపల వలలు తయారు చేసేవారు, పూలు అల్లేవారు, తదితర 18 చేతి వృత్తుల పని చేసేవారికి ఈ పథకం ద్వారా ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆరోపించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులు ఆర్థికాభివృద్ధిని సాధించుకోవచ్చు అని అన్నారు.అర్హులైన చేతివృత్తులు, హస్త కళాకారులు వడ్రంగి, కమ్మరి, కంసాలి, స్వర్ణకార, కుమ్మరి, మేదరి, ఉప్పరి, వెదురు బుట్టలు అల్లేవారు, బొమ్మలు చేసేవారు, రజకులు, నాయీ బ్రాహ్మణ, దర్జీలు, చేపల వలలు తయారు చేసేవారు, పూలు అల్లేవారు, తదితర 18 చేతి వృత్తులు చేసేవారికి ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన వారు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లో దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.