నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
2024-25 విద్యా సంవత్సరంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్ (రామంతపూర్, బేగంపేట) యందు 1వ తరగతి (డేస్ కాలర్) ప్రవేశం కొరకు గిరిజన లంబాడ, ఎరుకల విద్యార్థిని/ విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన గిరిజన విద్యార్థిని,విద్యార్థులు ఈనెల 4 నుండి జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయం సూర్యపేట లో ఉచితంగా దరఖాస్తులు పొంది చివరి తేదీ 11 సాయంత్రం 5 గంటల లోగా వివరాలు నమోదు చేసి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.