పలువురికి ఆర్థిక సాయం అందించిన ఎన్నారై రామ్ రెడ్డి

నవతెలంగాణ – ధర్మసాగర్
పలువురికి ఆర్థిక సహాయం అందించిన ఎన్నారై రామ్ రెడ్డి. మండలంలోని నారాయణగిరి గ్రామానికి చెందిన ఆడబిడ్డలకు పెళ్లి కానుకగా  చెరో 5వేల చొప్పున ఇద్దరు ఆడబిడ్డలకు పెళ్లికానుకను, కంటి ఆపరేషన్ చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్న యాదగిరి 5వేలు ఆర్థిక సహాయాన్ని విన్నారా రామ్ రెడ్డి  ఆదివారం అందించి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నారాయణగిరి గ్రామానికి చెందిన గొట్టిముక్కుల కుమార్- సుగుణ దంపతుల కూతురు సంధ్య వివాహానికి, మండల రాజు- రాధిక దంపతుల కూతురు కావ్య వివాహాలకు చెరో రూ. 5వేల చొప్పున ఇద్దరికి వల్లపురెడ్డి రాం రెడ్డి పెళ్లి కానుక అందించారు. అదే  గ్రామానికి చెందిన వక్కల యాదగిరి కంటి ఆపరేషన్ చేసుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఖర్చుల నిమిత్తం రూ.5వేలు ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు ఆదివారం రామన్న యువసేన సభ్యులు వారికి డబ్బులను అందజేశారు.  కార్యక్రమంలో. పిఎసిఎస్ డైరెక్టర్ మడికంటి రాజయ్య, కడియం యువసేన అధ్యక్షుడు గంటే కృష్ణ, ఎస్ఎంసి మాజీ చైర్మన్ వక్కల కరుణాకర్,మాజీ ఉపసర్పంచ్ మడికంటి వెంకన్న ,కుందేళ్ళ వెంకటేష్ ,వక్కల వీరన్న, వక్కల శ్రీనివాస్ ,దుస్స లక్ష్మయ్య ,గూడూరు రాజు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love