చక్కని భవిష్యత్తుకు చుక్కల మందు

– పోలియో చుక్కలను వేసిన ఎంపీపీ ప్రతాప్ రెడ్డి
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలోని ఏర్పాటుచేసిన పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆదివారంనాడు ఎంపీపీ ప్రతాప్ రెడ్డి  పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ..తెలంగాణ రాష్టంమూడు రోజుల పాటు పోలియో చుక్కల కార్యక్రమంఉంటాదానిచిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలనితెలంగాణ ప్రభుత్వం ఈ నెల 3వతేదీ నుంచి5వ తేదీ వరకు మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, అంగన్‌వాడి కేంద్రాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అయిదేళ్ల లోపు చిన్నారులకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు సూచించారు.పల్స్ పోలియో చుక్కలు వేసే విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని  వైద్య సిబ్బందికి సూచించారు. పోలియో చుక్కల విషయంలో ఏ ఒక్క ఇంటినీ విస్మరించకూడదని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది తమకు అప్పగించిన గ్రామాలు, వార్డులలోని ఇళ్లలో తిరుగుతూ చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయాలన్నారు.
ఈ కార్యక్రమంఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
Spread the love