
భువనగిరి మున్సిపల్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణానికి దళితుల సీలింగ్ అసైన్మెంట్ భూములలో నిర్మాణం చేపట్టిన మానపల్లి బంగారము వజ్రాల వ్యాపారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్కు ఈ సమస్యల ఫిర్యాదు చేసి మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణానికి గతములో దళితుల సీలింగ్ అసైన్డ్మెంట్ భూములలో నిర్మాణము చేపట్టిన మానెపల్లి వజ్రాల వ్యాపారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి దళితుల అసైనీలకు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం భూముల ధరలను ఇప్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని పగిడిపల్లికి ఆ గ్రామ పరిధిలో గల సీలింగ్ అసైన్ పట్టా భూములను ధళితులకు పట్టాలు ఇచ్చినటువంటి భూములను హైద్రాబాద్కు చెందిన మానెపల్లి వజ్రాల వ్యాపారి శ్రీ రామారావు అతని కుమారులు కలిసి దళితులకు అసైన్ చేసిన సీలింగ్ పట్టా భూములపై రిలిజియస్, ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ సంబంధిత అధికారుల నుండి ఎటువంటి అనుమతులు లేకుండా గుడి నిర్మాణం చేస్తున్నారు. కాని సీలింగ్ అసైన్మెంట్ పట్టాలు కల్గిన మాకు అన్యాయం జరుగుతుంది. అంతేగాక ప్రొహిబిషన్ అసైన్డ్ మెంటు యాక్ట్ ప్రకారం గతంలో దళితుల జీవనోపాధి కోసం సీలింగ్ పట్టాలు మంజూరు చేసిన వారికి విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నాము. సర్వే నెం. 61, 62, 63 (రైల్వే ట్రాక్) ఎంత మేరకు భూమి పోయింది. అదే విధంగా సర్వే నెం. 64, 75, 76, 86, 100,114, 126లో ఎంత ప్రభుత్వ భూములు ఉండెను. ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రతి సర్వే నెంబర్ పైన పేర్కొనబడిన విధంగా సమగ్ర సర్వే జరిపి దళితుల భూములను పరీక్షించాలని దళితుల ఐక్యవేదిక కోరుతుంది. అదే విధంగా గుడి నిర్మాణములో భూములు కోల్పోతున్న దళిత కుటుంబాలకు ప్రస్తుత మార్కెట్ ప్రకారం ధర కట్టించి మమ్ములను ఆదుకోవాలని కోరుతున్నాము. ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి సోమవారం ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షల్లో గణితము రాజకీయ శాస్త్రము జీవశాస్త్రం పరీక్షలకు 6880 విద్యార్థులకు 6494 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు నాలుగు వందల ముప్పై ఒక్క మంది విద్యార్థులు హాజరైనారని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి సి రమిని తెలిపారు.