
పెద్దకొడప్ గల్ మండలంలోని వడ్లం గ్రామంలో మంగళవారం రోజున పశు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు టీకాలు వేశారు. గాలికుంటు టీకాలు పశువులకు సోకే తీవ్రమైన అంటువ్యాధుల్లో గాలికుంటు వ్యాధి ప్రదానమైంది. దీన్నే శ్రీగాళ్లుశ్రీ అని పిలుస్తారు. ఇది వైరస్ ఆశించడంతో వస్తుంది. పశువులకు ఆశించే వైరస్లన్నింటిలోకి గాలికుంటు వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వ్యాధిని నిరోధించేందుకు, పశువులకు సోకకుండా ముందస్తుగా ఇస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయించాలని కోరుతున్నారు. పశువైద్య సిబ్బంది గ్రామాలకు చేరుకొని గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పశు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ సురేష్, గోపాలమిత్ర గౌస్, మాజీ ఎంపీటీసీ శామప్ప, సంజు పటేల్, దత్తు,నారాయణ,రైతులు పాల్గొన్నారు.