ఘనంగా మంత్రి దుద్దిల్ల పెళ్లి రోజు వేడుకలు 

నవతెలంగాణ – రామగిరి 
రామగిరి మండల కేంద్రంలో మండల ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పెళ్లిరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐటీ రాష్ట్ర శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శైలజ  రామయ్యర్ దంపతుల పెళ్లిరోజు సందర్భంగా పన్నూరు గ్రామంలో  ఉపాధి హామీ కూలీలకు మంథని నియోజకవర్గం అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు బర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అదేవిధంగాఉపాధి హామీ కూలీలకు వడ దెబ్బ తగలకుండా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామగిరి మండల అధ్యక్షుడు రొడ్డ బాపన్న, మాజి ఎంపీపీ కోరుకొప్పుల నీరజ తులసి రామ్,రామగిరి మండల కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ ముస్త్యాల శ్రీనివాస్, రామగిరి మండలం కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు జాగరి రజిత, రత్నాపూర్ గ్రామ శాఖ మహిళా అధ్యక్షురాలు  కెక్కర్ల  స్వరూప, మట్ట రాజ్ కుమార్, బోగే లింగయ్య,  సిద్ధం మురళి కృష్ణ, మడ్డి రాజ్ కుమార్, సోషల్ మీడియా కో కన్వీనర్, రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంఛార్జ్ శ్రీధర్ వీణ తదితరులు పాల్గొన్నారు.
Spread the love