
పెద్ద కొడపగల్ మండలంలోని పోచారం తాండ వాసులకు మంచి నీటి కట కాటాలు మొదలైంది. దింతో పంచాయతీ కార్యదర్శి రాములు ప్రభుత్వం అందజేసిన ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా ప్రజలకు నీళ్లు సరఫరా చేస్తున్నారాని ప్రజలు తెలిపారు. సుమారు నలబై రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు తమకు తాగడానికి సరఫరా కావడం లేదని తాండ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దింతో ఎండాకాలం ప్రారంభం అవుతున్న సమయంలోనే మంచి నీటి అందక కష్టాలు ఎదురుకుంటున్నామని అన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలకు మంచి నీటిని అందించేందుకు కృషి చేయాలని కోరుతున్నారు.