
దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదా పీఠం తరపున శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. శ్రీ శృంగేరి ఆస్థాన పండితులు వ్యాసోజుల రాధాకృష్ణ శర్మ పట్టు వస్త్రాలు తీసుకురాగా, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారికి అందజేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాధాకృష్ణ శర్మకు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తీర్ధ ప్రసాదాలు అందజేశారు.