
గాంధారి మండలంలోని గుర్జల్ గ్రామంలో అంబులెన్స్ లో మహిళ ప్రసవం జరిగింది. గాంధారి మండల .సీ హెచ్ సీ గాంధారి హాస్పిటల్ నుండి గర్భిణీని బాన్సువాడ హాస్పిటల్ కు తరలిస్తున్న మార్గ మధ్యలో మేడిపల్లి దగ్గరలోకి రాగానే నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్ పక్కన ఆపి అంబులెన్స్ సిబ్బంది డెలివరీ చేశరు. కృష్ణవేణి అండ్ రాందాస్ లకి పండంటి మగ బిడ్డ జన్మించాడు. డెలివరీ ఉదయం 5:28 ల కి అయినది ఈ ఆర్ సీ పీ డాక్టర్ దిలీప్ సార్ సహాయంతో ట్రీట్మెంట్ చేసి ఎం సి హెచ్ బాన్సువాడ హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. ఎం సీ హెచ్ బాన్సువాడ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. ఈఎంటి కమలాకర్ అండ్ పైలెట్ ప్రకాష్ గౌడ్ నూ కృష్ణవేణి భర్త రాందాస్ కృతజ్ఞత తెలిపారు.