– తెలంగాణ అమరులు కాసోజు శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ
నవతెలంగాణ-హిమాయత్ నగర్
బీఆర్ఎస్ నుంచి తనకు భువ నగిరి ఎంపీ అభ్యర్థిగా అవకాశమి చ్చి గెలిపించాలని మలిదశ తెలంగా ణ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ మాజీ సీఎం కేసీఆర్‌ను కోరారు. శుక్రవారం హైదరాబాద్ గన్‌పార్క్ వద్దనున్న అమరవీ రుల స్తూపం వద్ద శ్రీకాంతా చారి చిత్రపటానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. భువనగిరి అసెంబ్లీ స్థానానికి బీఆర్ఎస్ పార్టీని టికెట్ అడిగామని తెలిపారు. టికెట్ ఇవ్వడం తెలంగాణ అమరవీరులకు ఇచ్చే గౌరవమన్నారు. అన్ని పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించకుండా తనకు మద్దతు ఇవ్వాలన్నారు. రాష్ట్రం కోసం ప్రాణాలిచ్చిన అమరుల కుటుంబాలకు పదేండ్లుగా న్యాయం జరగలేదని, తన బిడ్డతో పాటు 1000 మంది బిడ్డలు అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబాలకు ఇప్పటి వరకు చట్టసభల్లో కనీసం నామినేటెడ్ పదవులు కూడా రాలేదన్నారు. ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ పదవులు ఇచ్చిందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేయని వారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు అమరవీరుల కుటుంబాలను గుర్తించాల న్నారు. రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన శ్రీకాంతా చారి తల్లిగా ఎంపీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నానని తెలిపారు.ఒకవేళ ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా నని ప్రకటించారు. ఏ పార్టీ టికెట్ ఇచ్చినా మిగతా పార్టీలు తమకు మద్దతు తెలపాలని ఆమె కోరారు. ఆమె వెంట న్యాయవాది నర్సింహారావు, నర్సింహా చారి, శివ వస్తల్య, వీరా చారి, వెంకటా చారి, వసంత, సునంద, సంతోష్, మణికంఠ చారి తదితరులు ఉన్నారు.