తెలుగు రాష్ట్రాల్లోకి ముత్తూట్‌ మైక్రోఫిన్‌ ప్రవేశం

తెలుగు రాష్ట్రాల్లోకి ముత్తూట్‌ మైక్రోఫిన్‌ ప్రవేశంముంబయి : ప్రముఖ మైక్రోఫైనాన్స్‌ సంస్థ ముత్తూట్‌ మైక్రోఫిన్‌ తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. తొలుత తెలంగాణలో నాలుగు శాఖలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. భువనగిరి, జనగాం, హన్మకొండ, పరకాలలో వీటిని తొలి దశలో మార్చిలో అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. తదుపరి 2024 జూన్‌ నాటికి ఆంధ్రప్రదేశ్‌కు విస్తరించనున్నట్లు వెల్లడించింది. తద్వారా రెండు రాష్ట్రాల్లోనూ ఆర్థిక సేవలను మరింత అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.

Spread the love