
పంట పొలాలు ఎండిపోతున్న నేటికి ఆదుకోలేని అసమర్ధ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు . ఆదివారం మండల పరిధిలోని రామోజీ తండా రామన్నగూడెం గ్రామాలలో ఎండిపోయిన వరి పొలాలను మిరప తోటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం లో ఒక ఎకరా పొలం ఎండలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ గ్రామంలో చూసిన ఎకరాల కొద్ది వరి పొలాలు ఎండిపోతున్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో బోరు బావులను పూడ్చి వేసిన రైతులు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ బావుల పూడిక తీస్తూ నూతనంగా బోర్లు వేపిస్తున్నారని అన్నారు. ఎండిపోయిన వరి పొలాలకు ఎకరాకు రూ.50వేల నష్టపరహారం
మిరప తోటలకు రూ.80000 నష్ట పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాలేశ్వరంలో నీళ్లున్న ఎత్తిపోయకుండా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారు. తప్ప ప్రజల కష్టాలు పట్టించుకోవడంలేదని అన్నారు. ఈ సందర్భంగా పలువురి రైతులతో మాట్లాడి పంటల వివరాలు తెలుసుకున్నాడు.అనంతరం రామన్నగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తూడి నరసింహారావు జడ్పీ వైస్ చైర్మన్ వెంకట్ నారాయణ గౌడ్, మరి పెద్ది శ్రీనివాస్ గౌడ్, టి ఎస్ సి ఎస్ చైర్మన్ కోనతం సత్యనారాయణ రెడ్డి, బొల్లె జానయ్య ,బత్తుల ప్రసాద్, కసగానిబ్రహ్మం తదితరులు ఉన్నారు.