నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ ఛైర్పర్సన్ గా నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ ను శుక్రవారం స్వగృహంలో నియోజకవర్గ యువజ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానిచడం జరిగింది. ఈ కార్యక్రమం లో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బైండ్ల ప్రశాంత్, పట్టణ యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు విజయ్ అగర్వాల్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అఖిల్, నియోజకవర్గ అధ్యక్షులు శశి, యువజన కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ అగర్వాల్, కండె కిరణ్, అల్లజాపూర్ సాయికిరణ్, శ్రీనివాస్ గౌడ్ (టైగర్) అఫ్రోజ్ , తదితర నాయకులు పాల్గొన్నారు.