పార్టీకి ద్రోహం చేసిన నీకు, నీ బిడ్డకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు: ఎమ్మెల్యే

నవతెలంగాణ – ధర్మసాగర్

బీఆర్ఎస్ పార్టీకి, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ద్రోహం చేసిన కడియం శ్రీహరికి, వారి కూతురు కడియం కావ్య కు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అభిమానులు ప్రజలు రాబోయే రోజుల్లో వారికి తగిన బుద్ధి చెప్తారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు మునిగేల రాజు అధ్యక్షతన అత్యవసర పత్రికా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తన పదవి తర్వాత ఉప ముఖ్యమంత్రిగా, ఎంపీగా,ఎమ్మెల్సీగా అత్యున్నతమైన స్థానాలు ఇచ్చి కడియం శ్రీహరి ఆదుకున్నారని గుర్తు చేశారు.నేడు వెన్నుపోటు దారునిగా తన కుటుంబ స్వలాభం కోసం స్వార్ధంగా మోసపూరితంగా ప్రజలను మోసం చేస్తున్న తెలంగాణ ద్రోహి కడియం శ్రీహరి అని మండిపడ్డారు. తాను చేస్తున్న పనికి ప్రజలు గమనిస్తున్నారని వారికి సమాధానం చెప్పే రోజులు ముందున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో మాదిగ సామాజిక వర్గం 17 శాతం ఉన్న ఆయన మాయ మాటలతో 0.2 ఉన్న తన కులానికి అత్యున్నత స్థానాలను కేటాయించడం జరిగిందన్నారు.బిఆర్ఎస్ పార్టీ పేరుతో బి ఫాం పొంది ఎమ్మెల్యేగా గెలుపొందిన కడియం శ్రీహరి తక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.తను కలలు కంటున్న ఎంపీ, కూతురుకు ఎమ్మెల్యే పదవి ఇప్పించాలనే కోరికతో తహతహలాడుతున్న కడియం శ్రీహరి అహంకార ఆలోచనలకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గ ప్రజలు,జిల్లా ప్రజలు వారి నోట్లో ఉమ్మి వేస్తూ, మెడలో చెప్పుల దండ వేసే రోజులు ముందున్నాయని అన్నారు. తన స్వార్థం కోసం మాదిగ సామాజిక వర్గానికి చెందిన స్థానిక నాయకులైన తాటికొండ రాజయ్య, అలాగే ఎంపీ పసునూరి దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గార్లకు తన కుట్రపూరితమైన ఆలోచనలతో పార్టీకి దూరం చేసిన ద్రోహి కడియం శ్రీహరి అని అన్నారు. నీతిమంతునిగా మచ్చలేని మనిషిగా అర్జునతస్థానాలను కల్పించిన కేసీఆర్ కు మోసం చేసిన నీకు  నీ బిడ్డకు రాబోయే ఎన్నికల్లో ఎలా గెలుస్తావో ఎలా గెలిపించుకుంటావో కాలమే నిర్ణయిస్తుందని ఆరోపించారు. నేను స్థానికునిగా నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు నిరంతరం అండగా ఉంటూ,కంటికి రెప్పలాగా కాపాడుకుంటానని అన్నారు. బై ఎలక్షన్ లో ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుండి బరిలోకి దింపి గెలిపించుకునే బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యురాలు జుబేదా లాల్ మహమ్మద్, వేలేర్ జడ్పిటిసి చాడ సరితారెడ్డి, స్థానిక ఎంపీటీసీ బొడ్డు శోభ, కర్ర సోమిరెడ్డి,సీనియర్ నాయకులు బొడ్డు ప్రభుదాస్, సోంపల్లి కరుణాకర్, చాడ కుమార్, కొలిపాక రమేష్,బొక్క దయాకర్,మాచర్ల సుదర్శన్,బొడ్డు రమణాకర్,బొడ్డు విప్లవ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love