బెంగళూరు : పొదుపు చర్యల్లో భాగంగా జీ ఎంటర్‌టైన్‌మెంట్ భారీగా ఉద్యోగులను ఇంటికి పంపిస్తోంది. బెంగళూరు టెక్ సెంటర్‌లో పని చేసే సిబ్బందిలో 50 శాతం మందిపై వేటు వేస్తోందని శనివారం రిపోర్టులు వచ్చాయి. సోనీతో విలీనం బెడిసికొట్టిన క్రమంలో ఈ తొలగింపులు జరగడం చర్చనీయాంశం అవుతోంది. సాధ్యమైనంత వరకు మానవ వనరుల తగ్గించుకుని పొదుపునపై దృష్టి సారించాలనే ఉద్దేవ్యంతో జీ ఎండి, సిఇఒ పునీత్ గోయంక ఈ చర్యలు తీసుకున్నారని సమాచారం.