
ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని ధర్మసాగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము సీఈఓ రాజిరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ధర్మసాగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యము కొనుగోలు కేంద్రన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా నేరుగా పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వరి కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు నేరుగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడానికి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉపయోగపడతాయని అన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సెంటర్ ఇంచార్జ్ ప్రభుదేవ్ వంశీ, ఆఫీస్ సిబ్బంది ఆవుల కుమారస్వామి, మురళీకృష్ణ ప్రవీణ్ కుమార్, రైతులు అమలి లు తదితరులు పాల్గొన్నారు.