Sunday, June 15, 2025
E-PAPER
Homeజాతీయంబ్లాక్ బాక్స్ ఆచూకీ ల‌భ్యం

బ్లాక్ బాక్స్ ఆచూకీ ల‌భ్యం

- Advertisement -

న‌వతెలంగాణ‌-హైద‌రాబాద్: గుజ‌రాత్‌లోని అహ్మదాబాద్ విమాన ప్రమాదం విష‌యం తెలిసిందే. లండన్‌కి వెళ్తున్న ఎయిర్ ఇండియా టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలింది. అయితే, ఇప్పుడు ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభమైంది. ఈక్ర‌మంలో ద‌ర్యాప్తు అధికారులు ఎట్ట‌కేల‌కు బ్లాక్ బాక్స్ ఆచూకీని క‌నిపెట్టారు. ప్ర‌మాద సంఘ‌ట‌న‌లో ఓ భ‌వ‌నం ప‌రిస‌ర ప్రాంతాల్లో ఆ బాక్స్ ఆచూకీని అధికారులు క‌నిపెట్టారు. డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (DFDR)ను సాధారణంగా బ్లాక్ బాక్స్ అని పిలుస్తారు. దీంతో అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాదానికి అస‌లు కార‌ణాలు తెలియ‌నున్నాయి.

సహజంగా బ్లాక్ బాక్సులు అత్యంత దృఢంగా ఉంటాయి. ఎలాంటి ప్రమాదానైనా తట్టుకుంటాయి. ప్రకాశవంతమైన నారింజ కలర్‌లో ఉండే ఈ బాక్స్ పేలుళ్లు, మంటలు, నీటి పీడనాన్ని, హై స్పీడ్ క్రాష్ లను తట్టుకుంటుంది. 25 గంటల సమాచారాన్ని నిల్వ చేస్తుంది.

బ్లాక్ బాక్స్ అనేది విమాన పనితీరు, పైలట్ల మధ్య సంభాషణలను రికార్డ్ చేసే ఒక పరికరం. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్ పిట్ వాయిస్ రికార్డర్ రెండు భాగాలను బ్లాక్ బాక్స్‌గా పరిగణిస్తారు. ఫ్లైట్ డేటా రికార్డర్ విమానం ఎంత ఎత్తులో ఉంది..? ఎంత వేగంతో ప్రయాణిస్తుంది..?, ఫ్లైట్ కంట్రోల్స్ పనితీరును రికార్డ్ చేస్తుంది. ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR) ఎత్తు, వేగం, ఇంజిన్ థ్రస్ట్, ఫ్లైట్ పాత్ డేటాతో సహా కీలకమైన టెక్నికల్ పెరామీటర్స్‌ని నమోదు చేస్తుంది. ఇక కాక్ పిట్ వాయిస్ రికార్డర్ పైలట్ల మధ్య సంభాషణలు, ఏటీసీ నుంచి వచ్చే ఆదేశాలు వంటి వాటిని సేకరిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -