దామరచర్లలో ఉచిత వైద్య శిబిరం..

నవతెలంగాణ – దామరచర్ల
దామరచర్ల మండల కేంద్రంలో అపోలో రీచ్ హాస్పిటల్ , వాసవి క్లబ్ బాహుబలి వాసవి వనిత క్లబ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో దామరచర్ల లో శుక్రవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్యశిబిరాన్ని  వాసవి క్లబ్ ఇంటర్నేషనల్  అధ్యక్షులు  ఆర్ రవిచంద్రన్ దంపతులు,  వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 104 A గవర్నర్ రాచర్ల కమలాకర్ లు  ప్రారంభించారు.ఈ సందర్భంగా పలువురికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.అనంతరం హై స్కూల్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు , దామరచర్ల యువ క్రీడాకారులకు ఆట సామాగ్రి, గ్రామపంచాయతీ సిబ్బంది సేవలు గుర్తించి వారికి చీరలు, మగవారికి దొతి టవల్స్ అందజేశారు.ఈ కార్యక్రమంలో రీజియన్ 7 చైర్మన్ సాము శ్రీనివాస్ జోన్ చైర్మన్ నకరికంటి సత్యనారాయణ ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ బాహుబలి అధ్యక్షులు కోటగిరి లక్ష్మణ్, కార్యదర్శి  ఏచూరి చిన్న కనకయ్య, కోశాధికారి దేవరశెట్టి భాస్కర్ . వాసవి క్లబ్ వనిత అధ్యక్షలు చిట్టిప్రోలు నాగలక్ష్మి, కార్యదర్శి ఈగ జ్యోతి, కోశాధికారి మారం ప్రమీల మరియు ఆర్యవైశ్య మిత్రులు పాల్గొన్నారు.
Spread the love