నవతెలంగాణ – సంతోష్ నగర్
యువతి అదృశ్యమైన ఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం…హైదరాబాద్ జిల్లా యాకుత్‌పురా నియోజకవర్గం కుర్ముగూడ డివిజన్ మాదన్నపేట్ చంద్రయ్య హాట్స్‌కు చెందిన గుండు లహరి ఈ నెల 8న ఇంటి నుండి బయటకు వెళ్లింది. ఎంతకీ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వేతికించడంతో పాటు తెలిసిన వారిని ఫోన్‌లో ఆరా తీసినా ఫలితం లేకపోయింది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.