– అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమే తెలంగాణకు జీవం పోసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి పాటుపడుతోందని తెలిపారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సీఎం ఆయనకు ఘన నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాతగా ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. భారతావని భవిష్యత్తును ముందుగానే ఊహించి, దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ భావి తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశ పురోగమనానికి ఆయన పునాదులు వేశారని నివాళులర్పించారు.