ఘనంగా మే డే వేడుకలు

నవతెలంగాణ-కాసిపేట
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా మే డే వేడుకలు నిర్వహించారు. కాసిపేట మండలంలోని సోమగూడెం భరత్‌ కాలనీ కొమురయ్య భవన్‌ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే ఘనంగా నిర్వహించారు. ఏఐటీయూసీ బ్రాంచ్‌ కార్యదర్శి దాగం మల్లేశ్‌ జెండాను ఆవిష్కరించారు. మండల కేంద్రంలో జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ఎదుట సీపీఐ నాయకుడు జాడి పోశం జెండా ఎగరావేశారు. దేవాపూర్‌ ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీ గేట్‌ ఎదుట సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సంకె రవి జెండా ఎగరవేశారు. కాసిపేట-1 గనిపై ఏఐటీయూసీ పిట్‌ కార్యదర్శి మీనుగు లక్ష్మీ నారాయణ, కాసిపేట-2 ఇంక్లైన్‌ పై బ్రాంచ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బియ్యాల వెంకటస్వామి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడుతూ కార్మికుల హక్కులను బీజేపీ ప్రభుత్వం కాల రాస్తుందని, మే డే స్ఫూర్తితో హక్కులను కాపాడుకోవాలని పేర్కొన్నారు. చత్తిస్‌ ఘడ్‌ అడువులలో లక్ష మంది సైన్యంతో ప్రవేశం చేసి అక్కడ ఉన్న ఆదివాసీ హక్కులను, చట్టాలను తుంగలో తొక్కుతున్నరన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు నాగేశ్వర్‌రావు, గొల్ల శ్రీనివాస్‌, చొప్పరి శ్రీహరి, వి రాజేందర్‌, సురేశ్‌, చౌడ లింగయ్య, సంపత్‌, సంతోష్‌, కోల్ల కమలాకర్‌, రంజిత్‌ కుమార్‌, ఆడెపు రవీందర్‌, పిల్లి వెంకటస్వామి, బల్లెం శ్రీనివాస్‌, రఘురాం, బియ్యాల రాజన్న పాల్గొన్నారు.
జైపూర్‌: మే డే సందర్భంగా ఐకే-1ఏ గని ఆవరణలో బుధవారం ఏఐటీయూసీ ఫిట్‌ కార్యదర్వి నవీన్‌రెడ్డి ఆద్వర్యంలో ఏఐటీయూసీ సీనియర్‌ నాయకులు విజరు కుమార్‌తో కలిసి కార్మిక జెండాను ఎగురువేశారు. అనంతరం అమరవీరులకు ఘన నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఐకే ఓపెన్‌ కాస్ట్‌ గని పిట్‌ కార్యదర్శి శ్రీకాంత్‌, సహాయ కార్యదర్శి రాజయ్య, రాములు, మధుకర్‌, సురేష్‌, వెంకటస్వామి, రమేష్‌, జై సూర్య, గణేష్‌, శేఖర్‌, సాగర్‌ పాల్గొన్నారు. అదేవిదంగా జైపూర్‌ సింగరేణి విద్యుత్‌ థర్మల్‌ ప్లాంట్‌ ఎదురుగా కార్మికులతో కలిసి మేడే ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి హాజరైన ఎస్‌ఎంఎస్‌ శ్రీరాంపూర్‌ ఏరియా వైస్‌ ప్రెసిడెంట్‌ తిప్పారపు సారయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ కార్మికులకు వెట్టి చాకిరి శ్రమదోపిడి తప్పడం లేదని అన్నారు. పవర్‌ ప్లాంట్‌ పరిసర గ్రామాలైన గంగిపల్లి, జైపూర్‌, ఎలుకంటి, పెగడపల్లి తదితర గ్రామాల వారు విలువైన వ్యవసాయ భూములను ప్లాంట్‌ ఏర్పాటుకు దారా దత్త చేసి ఉపాధికి దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. భూములను సమకూర్చిన రైతులకు సరైన పరిహారం చెల్లించకపోగా ప్లాంట్‌ ఆధారంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం శోచనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏస్టిపీపీ కాంట్రాక్ట్‌ కార్మిక సంఘం జనరల్‌ సెక్రెటరీ విక్రమ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రదీప్‌రెడ్డి, నాయకులు సాయి కృష్ణ, ఎలుక రమేష్‌, సత్యనారాయణ, చారి, రామగిరి మల్లేష్‌, మామిడాల రమేష్‌, రిక్కుల రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్‌: పట్టణంలోని స్థానిక సూపర్‌ బజార్‌లో ఐఎన్టీయూసీ కార్యాలయంలో బుధవారం చెన్నూర్‌ ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి జెండా ఆవిష్కరించి కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రిటైర్డ్‌ కార్మికులకు సన్మానం చేశారు. అలాగే ఏఐటీయూసీ నాయకులు బత్తుల రాజ్‌ కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
లక్షెట్టిపేట: ఏఐటీయూసీ ఆధ్వర్యంలో లక్షెట్టిపేట ఊత్కూర్‌ చౌరస్తా వద్ద హమాలి కార్మికులు మే డేను ఘనంగా నిర్వహించారు. ఏఐటీయూసీ మండల కార్యదర్శి కేతిరెడ్డి రమణారెడ్డి ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా కార్మికులు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేదరి దేవవరం, అవునూరి వెంకటేష్‌, రాచర్ల రవి కిరణ్‌, లింగంపల్లి భానుచందర్‌, బైరి రాజన్న, అన్నం శేఖర్‌ పాల్గొన్నారు.
జన్నారం: మండల కేంద్రంలో బుధవారం సీపీఐ(ఎం), సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. బస్టాండ్‌ దగ్గర, మార్కెట్‌ యార్డ్‌ సమీపంలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం మండల హమాలీ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కానీకారం అశోక్‌, కొండగుర్ల లింగన్న, కూకటికారి బుచ్చయ్య, అంబటి లక్ష్మణ్‌, మగ్గిడి జయ, ఒడిపల్లి అంజయ్య, శారద, హమాలీ సంఘం నాయకులు మేకల సత్యనారాయణ, బోయిని సత్యన్నా, లావుడియా అరవింద్‌ కాణిపాక హరీష్‌, శ్రీరవేణి సత్యన్నా పాల్గొన్నారు.
మందమర్రి: ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం గనులు, డిపార్ట్మెంట్‌లపై 138వ మే డే వేడుకులను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ యూనియన్‌ బ్రాంచ్‌ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, బ్రాంచ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ భీమ నాధుని సుదర్శన్‌ పాల్గొన్నారు. కేకే ఓసి నుంచి బ్రాంచ్‌ కార్యదర్శి సత్యనారాయణ, కేకే-5 నుంచి వైస్‌ ప్రెసిడెంట్‌ సుదర్శన్‌, షిర్కే ప్రాణహిత కాలనీలో బ్రాంచ్‌ జాయింట్‌ సెక్రెటరీ కంది శ్రీనివాస్‌, వర్క్‌ షాప్‌లో పెద్దపెల్లి బానయ్య, నారాయణ స్తూపం వద్ద బ్రాంచ్‌ సహాయ కార్యదర్శి సోమిశెట్టి రాజేశం పూలమాల వేసి మోట పలుకుల మహేందర్‌ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంది శ్రీనివాస్‌, సోమిశెట్టి రాజేశం, పెద్దపెల్లి బానయ్య, టేకుమట్ల తిరుపతి, అంతోని దినేష్‌, ఫిట్‌ కార్యదర్శిలు గాండ్ల సంపత్‌, సిహెచ్‌ పి శర్మ, మర్రి కుమారు, సంజీవ్‌ కుమార్‌, కలవల శ్రీనివాస్‌, మైనింగ్‌ స్టాప్‌ నాయకుడు సత్యనారాయణ, మనోహర్‌ పాల్గొన్నారు.
నస్పూర్‌: మున్సిపాలిటీ పరిధిలో 138వ ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు పలువురు బుధవారం ఘనంగా నిర్వహించారు. శ్రీరాంపూర్‌ సీఐటీయూ కార్యాలయంలో సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌(సీఐటీయూ) వెంగళ శ్రీనివాస్‌ అధ్యక్షతన బ్రాంచ్‌ అధ్యక్షుడు గుల్ల బాలాజీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కస్తూరి చంద్రశేఖర్‌ బానే సుధాకర్‌, మిడివెల్లి శ్రీనివాస్‌, సిరికొండ శ్రీనివాస్‌, శ్రీధర్‌, పెరుక సదానందం, సంఘం రాజయ్య పాల్గొన్నారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం, సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, ఎస్‌కే బాజీ సైదా, కొట్టే కిషన్‌రావు, కొమురయ్య పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్‌ బస్టాండ్‌ సమీపంలో కార్మిక విగ్రహానికి పూలమాల వేసి మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏరియా వైస్‌ ప్రెసిడెంట్‌ నీలబోయిన కుమార్‌, ఏరియా కార్యదర్శి సదిరం రాజేంద్రప్రసాద్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ జాడీ క్రాంతి కుమార్‌ పాల్గొన్నారు.

Spread the love