మొగులయ్యకు కేటీఆర్‌ ఆర్థిక సాయం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జానపద కళాకారుడు పద్మశ్రీ దర్శనం మొగులయ్యకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు ఆర్థిక సహాయం చేశారు.ఆయనకు గత ప్రభుత్వం ఇచ్చిన కళాకారుల పెన్షన్‌ ఆపివేయడంతో, కూలి పని చేసుకుంటున్నట్టు వచ్చిన వార్తలకు స్పందించిన కేటీఆర్‌ ఆయనకు ఆర్థిక సహాయం చేశారు. మొగులయ్యకు గత ప్రభుత్వం ఇచ్చిన కళాకారుల పెన్షన్‌తో పాటు అన్ని రకాల హామీలు నెరవేర్చాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొగులయ్య లాంటి జానపద కళాకారులు తెలంగాణకి గర్వకారణమనీ, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక సహాయం చేసిన మాజీ మంత్రి కేటీఆర్‌కు మొగులయ్య ధన్యవాదాలు తెలిపారు.

Spread the love