Thursday, June 19, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంస్పేస్‌ ఎక్స్ ప్ర‌యోగం విఫ‌లం

స్పేస్‌ ఎక్స్ ప్ర‌యోగం విఫ‌లం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ తయారు చేసిన స్టార్‌ షిప్‌ రాకెట్‌ మరోసారి పేలిపోయింది. అమెరికాలోని టెక్సాస్‌లోని ఎలాన్ మస్క్‌కు సంబంధించిన వాణిజ్య అంతరిక్ష విమాన సంస్థ స్పేస్‌ఎక్స్‌లో బుధవారం రొటీన్ స్టాటిక్ ఫైర్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. అంతే ఉన్నట్టుండి స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ పేలిపోయింది. ఈ ప్రమాదంతో స్పేస్‌ఎక్స్ భారీ నష్టాన్ని చవిచూసింది. ఈ మేరకు స్పేస్‌ఎక్స్ ఎక్స్‌ ట్విట్టర్‌లో ప్రమాద దృశ్యాలను పోస్ట్ చేసింది. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇది జరిగిందని పేర్కొంది. స్టార్‌షిప్ 10వ విమాన పరీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించింది. సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండడం వల్ల అందరూ సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. చుట్టుపక్కల కమ్యూనిటీ ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగలేదని పేర్కొంది. ఎవరూ ఈ ప్రాంతాలకు రావొద్దని సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -