Friday, June 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబ్రిటన్ పర్యటనకు బయలుదేరిన కేటీఆర్

బ్రిటన్ పర్యటనకు బయలుదేరిన కేటీఆర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఉదయం బ్రిటన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో రేపు, ఎల్లుండి జరగనున్న ‘ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం 2025’ సదస్సులో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, అధ్యాపకులు, పారిశ్రామికవేత్తలు, విధాన నిర్ణేతలు పాల్గొనే ఈ సదస్సులో, సాంకేతికత ద్వారా భారతదేశం సుస్థిర అభివృద్ధిని ఎలా సాధించగలదనే విషయంపై విస్తృతంగా చర్చించనున్నారు. కేటీఆర్ తన పర్యటన ముగించుకుని ఈ నెల 24న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -