డిప్యూటీ సూపరింటెండెంట్
వేధిస్తున్నారని ఆరోపణ
సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సింగ్ ఉద్యోగులు మంగళవారం విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రవర్తన సరిగా లేదని, ‘రావే, పోవే, బలిసిందా’ అని మహిళా ఉద్యోగులను అసభ్య పదజాలంతో దూషిస్తూ మనో వేదనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆస్పత్రిలో తాగునీరు, వాష్‌రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్, సెక్యూరిటీ, శానిటేషన్ సదుపాయాలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెలలో 14 మంది మహిళా నర్సింగ్ ఆఫీసర్లకు మెమోలు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ, పారిశుధ్య లోపాలకు నర్సులనే ఎలా బాధ్యులను చేస్తారని ప్రశ్నించారు. డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నగేశ్ తీరు సరిలేదని, అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని వాపోయారు. ‘నాలుగేండ్లుగా భరిస్తున్నాం.. ఇక భరించలేక బయటకు వచ్చాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆందోళనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను తేల్చాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వాస్పత్రిలో నర్సింగ్ సిబ్బంది ఆందోళన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



