మానవత్వం చాటిన గాంధీజీ ఫౌండేషన్ ఛైర్మెన్

– గాంధీజీ ఫౌండేషన్ ఛైర్మెన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు  
నవతెలంగాణ- చండూరు  
స్థానిక మున్సిపల్ కేంద్రంలోని   6వ వార్డు కు చెందిన   రాపోలు సాంబమ్మ  నిరుపేద మహిళ అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న గాంధీజీ ఫౌండేషన్ ఛైర్మెన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు  వారి ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు తెలుసుకొని వారి కుటుంభానికి 50కేజీ  ల బియ్యం, కిరాణా సామాను  సోమవారం  అందజేశారు.ఈ  కార్యక్రమంలో పున్న బిక్ష్మయ్య, రావిరాల రాజేంద్రప్రసాద్, తిరందాసు నందు, ఏలె సుధాకర్, సరికొండ వెంకన్న, రుద్ర యాదగిరి, గుర్రం అంజయ్య, జూలూరు వెంకటేశ్వర్లు, సంగిశెట్టి సాయి, బోడ విజయకుమార్  పాల్గొన్నారు.
Spread the love