
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
వరంగల్, ఖమ్మం,నల్గొండ శాసనమండలి పట్టబద్రుల ఉప ఎన్నికల పోలింగ్ సిబ్బందికి మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ జూనియర్ కళాశాలలో నిర్వహించినట్లు ఎమ్మెల్సీ ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి,జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎలాంటి తప్పులు జరగకుండా పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన కోరారు. సోమవారం నిర్వహించిన మొదటి విడత పోలింగ్ శిక్షణ కార్యక్రమానికి ఎఫ్ ఎస్ టి, ఎం సి సి బృందాలు, జోనల్ ఆఫీసర్లు,పిఓ, ఏపీవోలు ఉన్నారు. కాగా ఎఫ్ఎస్ టి బృందంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక బృందం, ఎం సి సి బృందంలో ఎంపీడీవో, మున్సిపల్ స్థాయిలో మున్సిపల్ కమిషనర్, జోనల్ అధికారులుగా తహసిల్దార్లు ఉన్నారు. మొత్తం 97 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 232 మంది పిఓ,పిఓలకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమానికి శిక్షణ నోడల్ ఆఫీసర్ తో పాటు, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, మాస్టర్ ట్రైనర్లు హాజరయ్యారు.