రైతులకు జీలుగు విత్తనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు 

నవతెలంగాణ – మిరుదొడ్డి
సాగుకు సన్నదం అవుతున్న రైతులకు నేటికీ జీలుగా విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులకు గురవుతున్నారని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి అన్నారు. దుబ్బాక నియోజకవర్గం లో జీలుగా విత్తనాల కోసం రైతులు ఎదురుచూస్తున్నప్పటికీ ప్రభుత్వం సరఫరా చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు అందుబాటులో జీలగ విత్తనాలు ఉంచడం జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు కావలసిన జీలుగా విత్తనాలతో పాటు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్ల వినతి పత్రాన్ని డిఏఓ శివప్రసాద్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంజిరెడ్డి తాజా మాజీ సర్పంచ్ రాములు, నాయకులు లింగం, సత్యనారాయణ, బైరయ్య ,కిష్టయ్య, బాలరాజు, పలువురు పాల్గొన్నారు.
Spread the love