– ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పదేండ్లు అధికారంలోకి ఉన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర గీతం ఏనాడూ గుర్తుకు రాలేదని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ‘జయ జయ హే’ గీతాన్ని అధికారికంగా గుర్తించగానే ప్రతిపక్ష నాయకులు ఓర్వలేకపోతున్నారని ఒక ప్రకటనలో విమర్శించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకులు కీరవాణిని ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సంబంధం లేని మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్‌సింగ్, సమంతలను బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రకటించినప్పుడు ఆ సోయి ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.